ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly: టీడీపీ సంచలన నిర్ణయం.. ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్ పూర్తిగా బాయ్‌కాట్.. కారణం ఇదే..

ABN, First Publish Date - 2023-09-22T12:56:18+05:30

ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్‌ని పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని టీడీపీ నిర్ణయించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో తమ హక్కులకు భంగం కలిగించడంతో ఈ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. శాసనసభలో అవినీతిపై చర్చించే దమ్ము వైకాపాకు ఉందా? సూటిగా ప్రశ్నించారు.

అమరావతి: ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్‌ని పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని టీడీపీ నిర్ణయించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో తమ హక్కులకు భంగం కలిగించడంతో ఈ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. శాసనసభలో అవినీతిపై చర్చించే దమ్ము వైకాపాకు ఉందా? సూటిగా ప్రశ్నించారు. ‘‘దమ్ముంటే 5 రోజులు చర్చ పెట్టండి, జగన్ అవినీతిపై అసలు సినిమా చూపిస్తాం. శాసనసభను వైకాపా కార్యాలయంలా మార్చేశారు’’ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారపక్షం తీరుకు నిరసనగా సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించామని, రేపటి నుంచి (శనివారం) శాసనసభ, మండలికి హాజరుకాబోమన్న అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.


చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేసి భేషరతుగా చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సభలో తామిచ్చిన వాయిదా తీర్మానం కనీసం సభాపతి చదవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మరో ఇద్దరు సభ్యుల్ని సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేశారని, స్పీకర్ తమను యూజ్‌లెస్ ఫెలోస్ అని తిట్టారని గుర్తుచేశారు. స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలని హితబోధ చేశారు. 22 మంది టీడీపీ సభ్యుల కోసం 200 మంది మార్షల్స్‌ను పెట్టి అడ్డుకున్నారని వైసీపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. శాసనసభలో ఏం జరుగుతుందో తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నారని, అందుకే వీడియోలు తీస్తున్నామని ఆయన చెప్పారు.

Updated Date - 2023-09-22T12:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising