Pattabhi ram: విద్యార్థులకు.. జగన్ రూ.3,400కోట్ల ఎగనామం..
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:26 PM
సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి.. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యాదీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు
అమరావతి: సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి.. 2020-21 విద్యా సంవత్సరంలో విద్యాదీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బటన్లను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు.. జగన్ రూ.700కోట్లు ఎగనామం పెట్టారన్నారు. జగన్‌రెడ్డి విద్యాదీవెన పథకం... అబద్ధాలు, మోసాలతో అమలవుతోందని విమర్శించారు.
విద్యార్థిలోకానికి.. జగన్‌రెడ్డి మొత్తం రూ.3,400కోట్లు బాకీ పడ్డారని చెప్పారు. 2020-21లో ఒక త్రైమాసికం, 22-23లో మరో త్రైమాసికం ఫీజు, అలాగే 23-24లో రెండు త్రైమాసికాల ఫీజు కలిపి మొత్తం రూ.2,800 కోట్లు బకాయి పడ్డారన్నారు. విద్యార్థులకు మేనమామ అని చెప్పుకొనే జగన్ రెడ్డి... వారి పాలిట కంసమామ అయ్యాడనానికి నిదర్శనమని ఎద్దేవాచేశారు. ఉత్తుత్తి బటన్లు నొక్కి మోసగించిన జగన్ రెడ్డిని.. విద్యార్థి లోకం ఓటు అనే బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలపాలని పట్టాభిరామ్ పిలుపునిచ్చారు.
Updated Date - Dec 30 , 2023 | 03:27 PM