ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy: అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వీడిన ఉత్కంఠ

ABN, First Publish Date - 2023-05-25T18:36:47+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) సీబీఐ (CBI) విచారణ ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గురువారం విచారణ చేపట్టింది. కొద్దిసేపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయమే వాదనలు వింటామని, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభిస్తామని కోర్ట్ తెలిపింది.

కాగా.. వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుంది. అయితే తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంగా ఉన్నారని, అరెస్ట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. కాగా శ్రీలక్ష్మీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో అవినాశ్ తల్లి చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2023-05-25T19:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising