ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LokeshPadayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. లోకేష్పై దాడి చేసేందుకు వైసీపీ మూకల ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-02-22T18:13:31+05:30

టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యేర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ నేత నారా లోకేష్ (NaraLokesh) యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యేర్పేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లోకేష్పై దాడి చేసేందుకు వైసీపీ మూకల ఏర్పాట్లు చేసుకున్నారు. ముందే పసిగట్టిన టీడీపీ (TDP) నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. టీడీపీ ఫిర్యాదుతో వైసీపీ నేతలతో పోలీసులు మాట్లాడి వచ్చారు. వైసీపీ (YCP) నేతలతో మాట్లాడామని ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు చెప్పారు. పాఠశాలలో వైసీపీ నేతలకు ఏం పని అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. లోకేష్ పర్యటనకు రక్షణగా వచ్చారా?.. వైసీపీ నేతలకు కాపలాగా వచ్చారా? అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే అంటున్న లోకేశ్‌, ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలోనూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఒక్కో హామీ ఇస్తున్నారు.

నేటి పాదయాత్ర ఇలా..

8.00: ఏర్పేడు మండలం కోబాక విడిదికేంద్రం

నుంచి పాదయాత్ర ప్రారంభం

8.45: కొత్తవీరాపురం స్థానికులతో మాటామంతి

12.00: మడిబాకలో రైతులతో ముఖాముఖి

1.00: మడిబాకలో భోజన విరామం

3.30: మునగలపాలెంలో స్థానికులతో సమావేశం

4.40: వికృతమాలలో స్థానికులతో మాటామంతి

5.45: పాపానాయుడు పేటలో

కైకాల సామాజిక వర్గీయులతో ముఖాముఖి

6.40: రేణిగుంట మండలం జీపాలెం

విడిదికేంద్రంలో బస.

Updated Date - 2023-02-22T19:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising