Book Festival: ముగిసిన పుస్తక మహోత్సవం
ABN, First Publish Date - 2023-02-19T19:41:22+05:30
విజయవాడ బుక్ ఫెస్టివల్ (Vijayawada Book Festival) సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 33వ పుస్తక మహోత్సవం
విజయవాడ: విజయవాడ బుక్ ఫెస్టివల్ (Vijayawada Book Festival) సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న 33వ పుస్తక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ విజయవాడ (Vijayawada) కలెక్టర్ దిల్లీరావు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి హాజరయ్యారు. దేశ నలుమూలల నుంచి మొత్తం 225 మంది ప్రచురణకర్తలు హాజరయ్యారు. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమైన పుస్తక మహోత్సవానికి సుమారుగా 1.50 లక్షల మంది సందర్శకులు వచ్చారని నిర్వాహకులు చెప్పారు. మొత్తం రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగిందని వివరించారు.
పుస్తక మహోత్సవం చరిత్రలో ఒక ల్యాండ్‌మార్క్
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ నెల 19న పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. గవర్నరు హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరై పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రచురణకర్తలు మహోత్సవంలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు వాటి కార్యకలాపాలను ప్రజలకు వివరించడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. 33వ పుస్తక మహోత్సవం చరిత్రలో ఒక ల్యాండ్‌మార్క్‌ను ఏర్పాటు చేసుకుంది. వరుసగా మూడుసార్లు గవర్నరు హరిచందన్ (Harichandan) విజయవాడ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. కోల్‌కతాలో జరిగిన పుస్తక మహోత్సవాన్ని అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు వరుసగా ప్రారంభించారు. ఆ తర్వాత ఒక్కరే మూడుసార్లు వరుసగా పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించడం విజయవాడలో జరిగింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ చరిత్రలో ఇదొక ఘట్టంగా నిలుస్తుందని సొసైటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
Updated Date - 2023-02-19T19:41:24+05:30 IST