ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bopparaju: ఉద్యమం ఆగదు: బొప్పరాజు

ABN, First Publish Date - 2023-05-21T21:43:01+05:30

ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉద్యోగుల పీఆర్సీ అరియర్స్‌, డీఏలకు సంబంధించి ఎప్పుడెంత ఇస్తారో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ప్రకటించారు. ఉద్యోగులకు రావాల్సిన లెక్కలు చెప్పకుండా ఆర్థిక శాఖ పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. ఖర్చు పేరుతో పేస్కేల్స్‌ ఆపడం దుర్మార్గమన్నారు. కొత్త పీఆర్సీ రికమండెడ్‌ పేస్కేల్స్‌‌తో పాటు 12 వ పేస్కేల్‌ కూడా ఇచ్చేలా లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. ఏపీ జేఏసీ అమరావతి తలపెట్టిన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా 73 రోజులుగా నిరవధికంగా కొనసాగుతోందని ప్రకటించారు. మూడు సంవత్సరాలుగా పీఆర్సీపై ఉద్యమం చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

ఒప్పందం చేసుకున్న అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. ఏ సంఘం వెళ్ళినా చాయ్‌, బిస్కట్‌ సమావేశాలతో సరిపెట్టిందే తప్ప ఉద్యోగుల సమస్యలను మాత్రం పరిష్కరించలేదన్నారు. చట్టపరంగా మాకు జీతాలు రావని తేలిన తర్వాత తాము ఉద్యమ బాట పట్టామన్నారు. భవిష్యత్‌ తరాలకు తాము దోషులుగా నిలబడకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పండగలు, డెడ్‌లైన్లు దాటిపోతున్నా ప్రభుత్వం ముందుకు కదలని దశలో తాము ఉద్యమం ప్రారంభించామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2023-05-21T21:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising