ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Coromandel Express: ‘ప్రమాదంలో మానవ తప్పిదం లేదు’

ABN, First Publish Date - 2023-06-03T21:20:49+05:30

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మానవ తప్పిదం ఏమీ లేదని తెలుస్తోందని వాల్తేరు రైల్వే డివిజన్‌ మేనేజర్‌ అనూప్‌కుమార్‌ శెత్పథి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మానవ తప్పిదం ఏమీ లేదని తెలుస్తోందని వాల్తేరు రైల్వే డివిజన్‌ మేనేజర్‌ అనూప్‌కుమార్‌ శెత్పథి తెలిపారు. బహనాగ్‌ బజార్‌ సమీపాన జరిగిన ప్రమాదంలో రెండు రైళ్లు సిగ్నళ్లకు అనుగుణంగా నడుస్తున్నాయన్నారు. రెండింటికి గ్రీన్‌సిగ్నల్‌ ఉందని, ఆ ప్రకారం అవి మాగ్జిమం వేగంతో వెళుతున్నాయన్నారు. రెండూ వేర్వేరు ట్రాకులు కాగా సడన్‌గా కోరమాండల్‌ లూప్‌ లైన్‌కి వెళ్లి గూడ్సురైలుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోందన్నారు. ఈ ప్రమాదంలో ఇటు కోరమాండల్‌, అటు యశ్వంతపూర్‌ రెండు రైళ్లూ పట్టాలు తప్పాయన్నారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. సహాయ కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని తూర్పు కోస్తా జోన్‌తో పాటు వాల్తేరు డివిజన్‌ నుంచి కూడా పలు బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లాయని అనూప్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-06-03T21:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising