ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu bail: చంద్రబాబు బెయిల్‌కు హైకోర్టు విధించిన 5 షరతులు ఇవే..

ABN, First Publish Date - 2023-10-31T12:12:12+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. అయితే ఈ బెయిల్‌కి కోర్టు 5 కండీషన్లు విధించింది.

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. అయితే ఈ బెయిల్‌కి కోర్టు 5 కండీషన్లు విధించింది.

1. పిటిషనర్ చంద్రబాబు రూ.1 లక్ష పూచీకత్తుతో 2 షూరిటీలు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

2. పిటిషనర్ చంద్రబాబు ఆయనే పరీక్షించుకొని/చికిత్స తీసుకోవాలి. హాస్పిటల్ ఎంపికతోపాటు ఖర్చు కూడా ఆయన భరించుకోవాలి.

3. తనకు ఇచ్చిన చికిత్సకు సంబంధించిన వివరాలను పిటిషనర్ కోర్టుకు తెలియజేయాలి. ఏ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కి సీల్డ్ కవర్‌ ద్వారా ఈ సమాచారం అందించాలి. ఈ సీల్డ్ కవర్ అధికారి ట్రయల్‌కు పంపించాలని కోర్టు స్పష్టం చేసింది.

4. పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినీ ప్రలోభపెట్టడం, బెదిరింపులు లేదా హామీలు ఇవ్వడం లాంటివి చేయకూడదు. కోర్టు లేదా మరేదైనా సంస్థకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరకూడదు.

5. నవంబర్ 28, 2023న సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో తనంతట తానే సరెండర్ కావాలి.

Updated Date - 2023-10-31T12:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising