Viveka murder case: అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొన్న నేపథ్యంలో మిగతా నిందితుల జాబితా ఇదే...
ABN, First Publish Date - 2023-06-08T17:51:19+05:30
అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా సీబీఐ పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసులో అవినాశ్ రెడ్డి కంటే ముందు ఎంతమంది నిందితులున్నారు?.. ఏ1 నుంచి ఏ7 వరకు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ రెడ్డికి (CM Jagan) చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో విచారణ కొనసాగుతోంది. సీబీఐ దర్యాప్తునకు ఎక్కడికక్కడ అవరోధాలు ఎదురవుతున్నాయి. నిందితులు కోర్టుల చుట్టూ తిరుగుతూ దర్యాప్తు సజావుగా సాగకుండా అడ్డుతగిలే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని (YS Avinash Reddy) 8వ నిందితుడిగా (A8) పేర్కొంది. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరులో ఈ విషయాన్ని సీబీఐ అధికారులు వెల్లడించారు. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డిల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా తండ్రీకొడుకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా సీబీఐ పేర్కొన్న నేపథ్యంలో ఈ కేసులో అవినాశ్ రెడ్డి కంటే ముందు ఎంతమంది నిందితులున్నారు?.. ఏ1 నుంచి ఏ7 వరకు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిశీలిద్దాం...
వివేకా కేసులో నిందితుల జాబితా...
A1 - ఎర్ర గంగిరెడ్డి
A2 - సునీల్ కుమార్ యాదవ్
A3 - ఉమాశంకర్ రెడ్డి
A4 - దస్తగిరి
A5 - దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి
A6 - ఉదయ్ కుమార్ రెడ్డి
A7 - వైఎస్ భాష్కర్ రెడ్డి
A8 - వైఎస్ అవినాశ్ రెడ్డి.
Updated Date - 2023-06-08T17:51:41+05:30 IST