ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh Padayatra: ముస్లింలకు ఎవరు మేలు చేశారో ఆలోచించాలి: లోకేష్

ABN, First Publish Date - 2023-02-05T17:02:15+05:30

సీఎం జగన్ (CM Jagan) దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య రద్దు చేశారని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. జగన్ పిల్లలు విదేశాల్లో చదవచ్చు కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: సీఎం జగన్ (CM Jagan) దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య రద్దు చేశారని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. జగన్ పిల్లలు విదేశాల్లో చదవచ్చు కానీ.. పేద ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదవకూడదా? అని ప్రశ్నించారు. కాణిపాకం (Kanipakam)లో మైనార్టీలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. తమ సమస్యలను లోకేష్ దృష్టికి మైనార్టీ యువకులు తెచ్చారు. వైసీపీ (YCP) నేతలు మసీదు స్థలాలను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ముస్లిం నేతలు లోకేష్ ముందు ఏకరువు పెట్టారు. ముస్లింలకు ఎవరు మేలు చేశారో ఆలోచించాలని లోకేష్ సూచించారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశిస్తామని, నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు.

అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో అక్రమ కేసులను ఎత్తేస్తామని తెలిపారు. ముస్లింలకు జగన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాజకీయంగా ముస్లింలను ప్రోత్సహించింది టీడీపేనని గుర్తుచేశారు. తమకు పార్టీ, కులం, మతం తెలియదంటూనే.. మైనార్టీ విద్యార్థులపై హత్యాయత్నం కేసులు పెట్టించారని తెలిపారు. నంద్యాల (Nandyala)లో వైసీపీ నేతలు వేధించడంతో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని గుర్తుచేశారు. వక్ఫ్ భూములపై పోరాడిన ఇబ్రహీంను నరికి చంపారని లోకేష్ తెలిపారు.

Updated Date - 2023-02-05T17:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising