Varla Ramaiah: పుంగనూరులో వైసీపీ దాడిపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
ABN, First Publish Date - 2023-08-04T18:36:22+05:30
అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై డీజీపీకి (DGP) టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
అమరావతి: అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై డీజీపీకి (DGP) టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు. లేఖతో పాటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, గాయాలపాలైన టీడీపీ కార్యకర్తల ఫోటోలను డీజీపీకి పంపించినట్లు వర్ల రామయ్య తెలిపారు.
"వైఎస్ఆర్ సీపీ నాయకులు మరోసారి కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలో వైసీపీ గూండాలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు అనేకమంది తీవ్ర గాయాలపాలయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో టీడీపీ బ్యానర్ లు, ఫ్లెక్సీలు సైతం తొలగించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా వైసీపీ గూండాలు వ్యవహరించడంతో పాటు, తెలుగుదేశం కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడ్డారు. టీడీపీ నాయకులకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు కార్లను ధ్వంసం చేసి తగలబెట్టారు. గతంలో కూడా ఇటువంటి దాడులు నందిగామ, ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై జరిగాయి. అయినా పోలీసులు వీటిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. శాంతి భద్రతలకు నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. మిగిలి ఉన్న చంద్రబాబు పర్యటనకు తగినంత బందోబస్త్ కల్పించాలి." అని లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.
Updated Date - 2023-08-04T18:37:02+05:30 IST