ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotam Reddy Sridhar Reddy: సమస్యలపై పోరాడుతున్నానే నిఘా: కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-03-15T21:17:03+05:30

నియోజకవర్గ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిర్విరామంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) తేల్చి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: నియోజకవర్గ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ నిర్విరామంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) తేల్చి చెప్పారు. రాజధాని అమరావతి (Amaravati)లోని వెలగపూడిలోని మారుతి సుజికీ షోరూమ్‌ నుంచి శాసనసభ వరకూ పాదయాత్ర నిర్వహించి బుధవారం ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలపై ప్లకార్డును ప్రదర్శిస్తూ ఆయన నడుచుకుంటూ అసెంబ్లీ (Assembly)కి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా పురోగతిలేని నియోజకవర్గ అభివృద్ధి, వేధిస్తున్న సమస్యలను ఏకరువు పెట్టారు. సమస్యలపై పోరాటం ప్రశ్నిస్తున్నందునే తనపై నిఘా పెట్టారన్నారు. సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లుగా తిరిగి తిరిగి విసిగిపోయానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

సమస్యలను పరిష్కరిస్తే ముఖ్యమంత్రి జగన్‌ (Chief Minister Jagan)ను అభినందిస్తానని తెలిపారు. వైసీపీకి దూరమైనా నియోజకవర్గ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో మైకు ఇచ్చేవరకూ పోరాటం చేస్తానని, మైకు ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నాళ్లు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పారు. అధికారపార్టీ శాసన సభ్యుడిగా అధికారుల చుట్టూ తిరిగి, తిరిగి విసిగి వేసారిపోయానన్నారు. అసెంబ్లీ వేదికగా సమస్యలపై పోరాటం చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రకటించారు. కాగా పాదయాత్ర సందర్భంగా కోటంరెడ్డి మెడలో వెలగపూడి రైతులు రైతు కండువా వేసి ఆయన పాదయాత్రను స్వాగతించారు. అసెంబ్లీలో అమరావతి రైతులు, ప్రజల సమస్యలపై కూడా పోరాడాలని కోరారు. అయితే దీనిపై ఆయన మౌనం ప్రదర్శించారు.

Updated Date - 2023-03-15T21:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising