Vijayawada: దుర్గగుడిలో బయటపడ్డ విభేదాలు
ABN, First Publish Date - 2023-10-10T13:39:19+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ ఆలయంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కీలకమైన దసరా కోఆర్డినేషన్ మీటింగ్‌కు దుర్గగుడి చైర్మన్‌కు ఆహ్వానం అందని పరిస్థితి. దుర్గగుడి కింద జమ్మిదొడ్డిలో కోఆర్డినేషన్ మీటింగ్‌కు కలెక్టర్, సీపీ, ఈవో, ఎండోమెంట్ అధికారులు హాజరయ్యారు. తనును మీటింగ్‌కు పిలవకుండా ప్రొటోకాల్ పాటించలేదని చైర్మన్ కర్నాటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చైర్మన్ చాంబర్‌లో పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. దసరా కోఆర్డినేషన్ మీటింగ్‌కు హాజరైన ఈవోపై పాలకమండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయశాఖమంత్రికి ఫిర్యాదు చేస్తామని చైర్మన్, పాలకమండలి సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ.. కీలకమైన దసరా మీటింగ్ జరుగుతున్నట్టు తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఒక చైర్మన్‌గా తనకు ఎందుకు మీటింగ్‌కు ఆహ్వానం ఇవ్వలేదో ఈవోకే తెలియాలన్నారు. మీటింగ్ జరుగుతున్నట్టు కనీస సమాచారం లేదన్నారు. ప్రొటోకాల్ పాటించకపోవడంపై కచ్చితంగా దేవాదాయశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామని కర్నాటి రాంబాబు వెల్లడించారు.
Updated Date - 2023-10-10T13:39:19+05:30 IST