Durgamma Temple: 28న చంద్రగ్రహణం.. దుర్గమ్మ ఆలయం మూసివేత
ABN, First Publish Date - 2023-10-26T12:22:33+05:30
రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 28న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు.
విజయవాడ: రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 28న కనకదుర్గమ్మ ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం 28న సాయంత్రం 6:30 గంటలకు అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం చేయనున్నారు. 28న శనివారం సాయంత్రం అమ్మవారికి ప్రదోష కాల హారతులు నిర్వహించిన అనంతరం సాయత్రం 6:30 గంటలకు కవాట బంధనం చేయనున్నారు. ఈ సందర్బంగా సాయంత్రం నిర్వహించే నిత్య పల్లకి సేవ నిలిపివేయనున్నారు. గ్రహణకాలం అనంతరం 29న ఆదివారం ఉదయం 3:00లకు అమ్మవారి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలను కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహించనున్నారు. 29న ఉదయం 9:00 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 29 తెల్లవారుజామున నిర్వహించే ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చన నిలివేయనుండగా.. గ్రహణకాలం అనంతరం అన్ని ఆర్జితసేవలు యధావిధిగా జరుగనున్నాయి.
Updated Date - 2023-10-26T12:22:33+05:30 IST