ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BV Raghavulu: పదిరోజుల్లోనే సోమువీర్రాజు మాట మార్చారు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-05-07T10:35:49+05:30

జగన్ మంచి పనులు చేస్తున్నందునే మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చప్పడం విడ్డూరమన్నారు. పది రోజునుల్లోనే వీర్రాజు మాటలు మారిపోయాయని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంపై చార్జ్‌షీట్‌లు వెయ్యమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు (BJP Leader Somuveerraju) ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు (CPM politburo members BV Raghavu) వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రానికి మద్దతు ఇస్తే ఎటువంటి తప్పులు చేసిన ఆమోదయోగ్యం అనే ధోరణి సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో దుర్భరమైన రాజకీయ వాతావరణం ఉందని విమర్శించారు. ఏపీలో అన్ని పార్టీలు మోడీ ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకే తపనపడుతున్నాయన్నారు. జగన్ మంచి పనులు చేస్తున్నందునే మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చప్పడం విడ్డూరమన్నారు. పది రోజునుల్లోనే వీర్రాజు మాటలు మారిపోయాయని అన్నారు. బీజేపీని ఓడించడానికి ఎవరు మద్దతిస్తే వారితోనే పొత్తు అని స్పష్టం చేశారు. రెజ్లర్స్‌పై బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపుల ఉదంతంపై కేంద్రానికి స్పందనలేదన్నారు. రాజధాని నడిబొడ్డున ఆందోళన జరుగుతున్నా పట్టడంలేదని మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. దివాలాతీయించి ప్రైవేటీకరణ చేయడానికే పట్టుదలతో ఉందని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి మూడేళ్లయ్యిందని... అక్కడి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని బీవీ రాఘవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-05-07T10:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising