ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vizag: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌పై డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రెస్‌మీట్

ABN, First Publish Date - 2023-11-22T16:48:51+05:30

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

విశాఖ: భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మ్యాచ్ కోసం మొత్తం 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని.. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హనుమంత వాక నుంచి మారిక వలస మధ్యలో హెవీ వెహికల్స్‌కు అనుమతి లేదన్నారు. క్రికెట్ టికెట్లు అన్ని అమ్ముడైపోయాయని.. టికెట్లు ఉన్న వారు టు వీలర్స్, ఫోర్ వీల్ వెహికల్స్‌కు అనుమతిస్తామని చెప్పారు. ఎటువంటి తిను బండారాలను స్టేడియం లోపలకి అనుమతించమని పేర్కొన్నారు. ఆల్కాహాల్ తీసుకున్న వారిని అనుమతిoచం.. పైగా వారిపై కేసులు కూడా బుక్ చేస్తామని హెచ్చరించారు. నిర్ణీత పార్కింగ్ ప్లేస్‌లో కాకుండా వాహనాలు పెడితే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్ సాయంత్రం 7గంటలకు ప్రారంభమవుతుందని.. రెండు గంటల ముందు ప్రేక్షకులను స్టేడియంలో అనుమతిస్తామని వెల్లడించారు. గురువారం విశాఖ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్ జరగనుంది.

Updated Date - 2023-11-22T17:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising