Ganta Srinivasa Rao: వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది...
ABN, First Publish Date - 2023-03-18T15:11:28+05:30
విశాఖ: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని అన్నారు.
విశాఖ: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని అన్నారు. పట్టభద్రుల ఎన్నికలో గెలుపొందిన చిరంజీవి (Chiranjeevi)కి ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డెవలప్‌మెంట్ మోడ్ (Development Mode)లో కాకుండా డిస్ట్రక్షన్ (Destruction) విధానంలో పరిపాలన మొదలైందని ఆరోపించారు. సీఎం జగన్ (CM Jagan) అధికారంలోకి వచ్చి కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించారన్నారు.
గతంలో జరిగిన ఎన్నికలలో ఏదో విధంగా మేనేజ్ చేసి వైసీపీ (YCP) గెలుస్తూ వచ్చిందని గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఆరు నెలల ముందే ప్రకటించారని.. అయినా ఓటర్లు వైసీపీని ఓడించారని అన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న అధికారపార్టీ మంత్రులు, ముఖ్య నాయకులు వైసీపీ అభ్యర్థి కోసం కృషి చేసారని.. అనేక అవకతవకలకు పాల్పడ్డారని, ఓట్లు కోసం వెండి నాణేలు, డబ్బులు పంచారని అన్నారు. చిరంజీవి ఆలస్యంగా వచ్చినా.. ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదని.. బులెట్ దిగిందా లేదా అనే విధంగా గెలుపొందారన్నారు. దొంగ ఓట్లు నమోదు చేయించారని.. అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే నాంది అని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో వైసీపీని ఉత్తరాంద్ర ప్రజలు నమ్మలేదని అర్ధం అవుతోందని పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) అన్నారు. రాజధాని పేరుతో విశాఖను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో దోపిడీని గుర్తించి పట్టభద్రుల చిరంజీవిని గెలిపించారని అన్నారు. చిరంజీవికి వ్యక్తిగత చరిష్మా కలసి వచ్చిందని... ఈ సందర్భంగా ఉత్తరాంద్రలో ఉన్న పట్టభద్రులకు పల్లా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2023-03-18T15:11:28+05:30 IST