Visakha: గడప గడపకి దగా ప్రభుత్వం పుస్తకం ఆవిష్కరణ
ABN, First Publish Date - 2023-04-14T14:52:19+05:30
విశాఖ: నగరంలో జై భీమ్ భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
విశాఖ: నగరంలో జై భీమ్ భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జడ శ్రావణ్ కుమార్ (Jada Shravan Kumar) అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘గడప గడపకి దగా ప్రభుత్వం’ పుస్తకం ఆవిష్కరించారు. ఈ సమావేశానికి డాక్టర్ సుధాకర్ స్మారక వేదికగా నామకరణం చేశారు. అనంతరం జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. జగన్ పాలనలో 1500 దురదృష్టకర సంఘటనలు జరిగాయన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను ఇతర పధకాలకు దారి మళ్లించడం నేరం కాదా? అని ప్రశ్నించారు.
జగనన్నే మా భవిష్యత్తు అని ప్రచారం చేసుకుంటున్నవారు.. దళితులు, అణగారిన వర్గాలకు చేస్తున్న అన్యాయంపై మీరు పుస్తకాలు రాయగలరా? అని జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. 2024 ఎలక్షన్ వరకూ పబ్లిక్ ప్రదేశాల్లో పుస్తకాలను పంచుతామని స్పష్టం చేశారు. 165 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి నిధులు లేవని జగన్ ప్రభుత్వం నిలుపుదల చేసిందని, మార్గదర్శికి మద్దతుగా మాట్లాడినందుకు ఈనెల 15న సీబీఐ ముందు హాజరు కావాలని నోటీసులు ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలబడాలని.. వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని నిస్సహాయ స్ధితిలో ఉన్నారని జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
Updated Date - 2023-04-14T14:52:19+05:30 IST