కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Giddi Eswari: మళ్లీ జగన్ వస్తే ఏపీ అంధకారంలోకి వెళుతుంది..

ABN, First Publish Date - 2023-10-11T15:03:32+05:30

అల్లూరి జిల్లా: వైసీపీ ప్రభుత్వం అవినీతి పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబును రిమాండ్ చేస్తే.. బాబు చేసిన అభివృద్ధి తెలుగువారు ఉన్న ప్రతి చోట జాతీయ, అంతర్జాతీయంగా బయటకు వచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు.

Giddi Eswari: మళ్లీ జగన్ వస్తే ఏపీ అంధకారంలోకి వెళుతుంది..

అల్లూరి జిల్లా: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) అవినీతి పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu)ను రిమాండ్ చేస్తే.. బాబు చేసిన అభివృద్ధి తెలుగువారు ఉన్న ప్రతి చోట జాతీయ (National), అంతర్జాతీయంగా (International) బయటకు వచ్చిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి (Giddi Eswari) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం పాడేరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) మళ్ళీ వస్తే.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదని.. అంధకారంలోకి వెళుతుందని.. ఇప్పటికే రోడ్లు గోతులు పడి వున్నాయని, మళ్లీ వస్తే రోడ్లు నూతులై కనిపిస్తాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఏజెన్సీలో రెడ్డీలను దింపి దోచుకున్నారని ఆరోపించారు.

అప్పుడు రావాలి జగన్ అన్న ప్రజలు.. ఇప్పుడు పోవాలి జగన్.. రావాలి బాబు; సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేస్తున్నారని గిడ్డి ఈశ్వరి అన్నారు. జగన్ అధికారంలోకి రావడానికి కోడికత్తి డ్రామాలాడి, బాబాయిని హత్య చేయించి.. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపైకి నెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు బాబాయి వివేకను చంపిన కేసులో ఎంపీ వినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేస్తారనగానే సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళి కేంద్రం పెద్దల కాళ్ళు పట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ చేసిన దుర్మార్గాలపై ప్రజలను మభ్య పెట్టడానికి చంద్రబాబును అరెస్ట్ చేయించారని, పాడేరు నియోజగవర్గంలో టీడీపీ ప్రతిఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించి.. టీడీపీని అధికారంలోకి తెచ్చుకుంటామని గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-11T15:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising