ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: రుషికొండ వద్ద జనసేన వినూత్న నిరసన..‌‌

ABN, First Publish Date - 2023-08-07T12:31:34+05:30

విశాఖ: నగరంలో ఆస్తులు హరించేస్తున్నారంటూ రుషికొండ వద్ద జనసేన నేతలు, కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రజల అస్తులు గోవిందా.. కొండలు గోవిందా... భూములు గోవిందా’ అంటూ నినాదాలు చేశారు.

విశాఖ: నగరంలో ఆస్తులు హరించేస్తున్నారంటూ రుషికొండ (Rushikonda) వద్ద జనసేన నేతలు (Janasena Leaders), కార్యకర్తలు (Activists) వినూత్న నిరసన చేపట్టారు. ‘ప్రజల అస్తులు గోవిందా.. కొండలు గోవిందా... భూములు గోవిందా’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భీమిలి జనసేన ఇన్చార్జ్ పంకర్ల సందీప్ మాట్లాడుతూ వారాహి (Varahi) విజయవంతం కావాలని తాము కొండకు వచ్చామని, ఇది సెన్సిటివ్ ఏరియా అని పోలీసులు అడ్డు చెప్పారన్నారు. ఎందుకు ఈ పరిస్ధితి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవునికి మొక్కుకోకుండా అడ్డుపడ్డం తమ మనోభావాలు దెబ్బతీయడం కాదా ప్రశ్నించారు.

టూరిజం (Tourism) పేరు చెప్పి రుషికొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారని సందీప్ విమర్శించారు. అక్కడ ఇప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి ఏర్పాట్లు చేస్తున్నారని, రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయ‌ని హైకోర్టే చెప్పిందన్నారు. రుషికొండను సీఎం జగన్ (CM Jagan) కబ్జా చేశారని రుజువైందన్నారు. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) ఆనందపురం తర్లువాడ కొండను కబ్జా చేస్తున్నారని, మాజీ మంత్రి అవంతీ ఎర్రమట్టి దిబ్బలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి దురగతాలకు అడ్డు కట్టపడాలన్నారు. వారాహి యాత్రలో అక్రమాలను నిలదీసి ప్రజలను చైతన్య పరుస్తామని సందీప్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-07T12:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising