Minister Gudivada Amarnath: అమర్నాథ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ..
ABN, First Publish Date - 2023-03-03T09:17:00+05:30
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath)కు విశాఖ ఆరో..
విశాఖ: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Minister Gudivada Amarnath)కు విశాఖ ఆరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కమ్ రైల్వే న్యాయస్థానం(Visakha Sixth Metropolitan Magistrate's Come Railway Court) నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రైల్వే స్టేషన్లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట అమర్నాథ్(Amar Nath) పై కేసు నమోదైంది. 2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్లోకి అనధికార ప్రవేశం చేశారు. విశాఖ-పలాస ప్యాసింజర్(Visakha-Palasa Passenger) రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్(Gudivada Amar)తో పాటు పలువురు వైసీపీ నేతలు(YCP leaders) ఉన్నటు రైల్వే అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా నిందితులు ఫిబ్రవరి 27న న్యాయ స్థానంలో హాజరు అవ్వాలి. కానీ..గుడివాడ అమర్నాథ్, జాన్ వెస్లీలు కోర్ట్‌కి హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్ అరెస్ట్ వారంటీ(Non bail arrested warranty) జారీ కేసును మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
Updated Date - 2023-03-03T09:21:17+05:30 IST