Vizag Navy Marathon : ఆర్కే బీచ్‌లో నేవీ మారథాన్
ABN, First Publish Date - 2023-11-05T07:53:37+05:30
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ( RK Beach ) లో 8వ ఎడిషన్ నేవి మారథాన్ ( Navy Marathon ) ఘనంగా ప్రారంభమైంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీలలో మారథాన్‌ను నిర్వహించారు.
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ( RK Beach ) లో 8వ ఎడిషన్ నేవి మారథాన్ ( Navy Marathon ) ఘనంగా ప్రారంభమైంది. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కే, 5కే కేటగిరీలలో మారథాన్‌ను నిర్వహించారు. ఫుల్ మారథాన్‌ను వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కార్ జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్‌ను వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్ జెండా ఊపి ప్రారంభించారు.వైజాగ్ నేవీ మారథాన్ 2023లో 10కే రన్‌ను విశాఖపట్నం సీపీ డా.ఏ రవిశంకర్ ప్రారంభించారు. విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుని మారథాన్‌లో పాల్గొన్నారు. దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది. వైజాగ్ మారథాన్ 2023 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశాఖ నగరవాసులు ఉత్సహంగా పాల్గొన్నారు. విశాఖ నగర ప్రాముఖ్యతను తెలపడానికి ఈ మారథాన్ ఎంతగానో ఉపయోగపడతుందని నేవీ అధికారులు తెలిపారు.
Updated Date - 2023-11-05T07:57:29+05:30 IST