Amaravati: యువగళం సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:41 AM
అమరావతి: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది.
అమరావతి: సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారం పరిసమాప్తం కానుంది. గ్రేటర్ విశాఖ, శివాజీనగర్‌లో ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ యువగళం సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు అవుతున్నారు. కాగా గత రాత్రి జనసేన అధినేత, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. అనేక అంశాలపై చర్చలు జరిపారు. యువగళం సభకు హాజరు కావాలని కోరారు. అయితే పని వత్తిడి వలన రాలేక పోతున్నానని తొలుత చెప్పిన పవన్ కళ్యాణ్.. చివరకు చంద్రబాబు ఆహ్వానంతో వస్తానని, సభకు హాజరు అవుతానని చెప్పారు. దీంతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యువగళం సభకు పవన్ వస్తానని అధికారికంగా ప్రకటించారు.
Updated Date - Dec 18 , 2023 | 10:41 AM