ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Visakha: పవన్‌ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు

ABN, First Publish Date - 2023-08-11T16:54:02+05:30

విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విశాఖ పర్యటన సందర్భంగా టెన్షన్ కొనసాగుతోంది. పవన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఆయన పర్యటనపై పోలీసులు విచిత్ర ఆంక్షలు విధించారు. జోడుగులపాలెం దగ్గర అందరూ ఆగిపోవాలని ఆదేశించారు.

విశాఖ: జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) విశాఖ పర్యటన సందర్భంగా టెన్షన్ (Tension) కొనసాగుతోంది. పవన్‌కు పోలీసులు నోటీసులు (Notices) జారీ చేశారు. మరోవైపు ఆయన పర్యటనపై పోలీసులు విచిత్ర ఆంక్షలు విధించారు. జోడుగులపాలెం దగ్గర అందరూ ఆగిపోవాలని ఆదేశించారు. రాడిషన్ బ్లూ హోటల్ దగ్గర పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. రుషికొండ (Rushikonda) దగ్గర రోడ్డుకు కుడివైపున పవన్ వెళ్లకూడదన్నారు. ఎడమవైపునే వెళ్లాలని పోలీసులు షరతులు విధించారు. కుడివైపున ఉన్న రుషికొండవైపు కాకుండా ఎడమవైపు వెళ్లమనడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇక రుషికొండ దగ్గర మీడియా సమావేశం పెట్టవద్దని ఆంక్షలు పెట్టారు. గీతం యూనివర్శిటీ దగ్గర మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల తీరుపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ఏమైనా నిషేధిత ప్రాంతమా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్చ, ప్రాధమిక హక్కులపై ఆంక్షలు, రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయని జనసేన న్యాయవాదులు చెబుతున్నారు. కాగా నోవోటెల్ దగ్గర పవన్‌ని చూడడానికి భారీగా అభిమానులు తరలి వచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-11T16:54:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising