ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Purandeswari: చంద్రబాబు, అమిత్ షా భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదు..

ABN, First Publish Date - 2023-06-11T12:20:32+05:30

విశాఖ: సీబీఐ (CBI) అనేది స్వతంత్ర సంస్థ అని, దానిపై ఎవరి ప్రభావం ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి (Purandeswari) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: సీబీఐ (CBI) అనేది స్వతంత్ర సంస్థ అని, దానిపై ఎవరి ప్రభావం ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి (Purandeswari) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె విశాఖ (Visakha)లో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ వ్యవహారంలో ఎవరి జోక్యం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావలసినవి వస్తున్నాయని, నిధులు ఇస్తే ఇచ్చారని, ఇవ్వకపోతే ఇవ్వలేదని మీడియానే అంటుందన్నారు. చంద్రబాబు (Chandrababu), అమిత్ షా (Amit Shah) భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, అమిత్ షాను ఎవరైనా కలవచ్చునని అన్నారు. పొత్తులు అనేవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసే ఉన్నాయని పురందేశ్వరి స్పష్టం చేశారు.

కాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా ఆదివారం విశాఖ నగరానికి వస్తున్నారు. శ్రీకాళహస్తిలో శనివారం జరిగిన సభకు నడ్డా హాజరు కాగా...విశాఖ సభకు అమిత్‌ షా వస్తున్నారు. ఇక్కడి రైల్వే ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ప్రధాని హోదాలో మోదీ 2019లో వచ్చినప్పుడు కూడా ఇదే గ్రౌండ్‌లో సభ నిర్వహించారు. ఇప్పుడు అక్కడే అమిత్‌ షా విశాఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభకు ఆయన తమిళనాడు నుంచి బయలుదేరి ఆదివారం సాయంత్రం వస్తారు. ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాట్లాడతారు. ఆ తరువాత పోర్టు అతిథి గృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత ఎనిమిది గంటలకు అక్కయ్యపాలెంలోని సాగరమాల ఆడిటోరియంలో శక్తి కేంద్రాల ప్రముఖులు వంద మందితో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి పురందేశ్వరి, సత్యకుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మురళీధరన్‌ తదితరులు పాల్గొననున్నారు.

Updated Date - 2023-06-11T12:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising