Anakapalli Dist.: పోలీసులపై బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహం..
ABN, First Publish Date - 2023-09-10T10:17:02+05:30
అనకాపల్లి జిల్లా: పరవాడ మండలం, వెన్నెల పాలెంలో ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయటకు వస్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర గవర్నర్ను కలవడానికి వెళుతుంటే అడ్డుకోవడంపై ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా: పరవాడ మండలం, వెన్నెల పాలెంలో ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయటకు వస్తున్న టీడీపీ నేత (TDP Leader), మాజీ మంత్రి (Ex Minister) బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy)ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర గవర్నర్ (Governor)ను కలవడానికి వెళుతుంటే అడ్డుకోవడంపై ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖలో రాష్ట్ర గవర్నర్ను కలవడానికి టీడీపీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారని, గవర్నర్ను కలిసే టీడీపీ నేతల జాబితాలో తన పేరు కూడా ఉందన్నారు. గవర్నర్ను కలవడానికి వెళ్తుతుంటే తనను పోలీసులు అడ్డుకోవడం ఏమిటి?.. ఇదేమి సంప్రదాయం?.. పోలీసుల తీరు దారుణంగా ఉందని బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు.
Updated Date - 2023-09-10T10:17:02+05:30 IST