ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

ABN, Publish Date - Dec 16 , 2023 | 04:40 PM

Andhrapradesh: యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీవీఎంసీ 82వ వార్డులో యాదువలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

అనకాపల్లి: యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్యు (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీవీఎంసీ 82వ వార్డులో యాదువలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. యాదవ అనేగానే పౌరుషం గుర్తు వస్తుందన్నారు. యాదవులకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. నా బీసీలు అంటూనే జ‌గ‌న్ రెడ్డి యాదవుల‌కి చేసిన మోసాలలో ఇవి కొన్నే అని అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి యాద‌వుల‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తోందని తెలిపారు. టీడీపీ హయాంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.278 కోట్లు ఖర్చు చేశామన్నారు. 90 శాతం సబ్సిడీతో ఆదరణ పథకం ద్వారా పరికరాలు అందించామన్నారు. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించామని తెలిపారు. యాదవుల‌ను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించామన్నారు. పశుసంవర్ధక శాఖ ద్వారా రూ.395 కోట్లతో సహకార సంఘాల ఆధ్వర్యంలో గొర్రెలు కొనుగోలు చేశామని తెలిపారు.

గొర్రెలు, మేక‌ల‌కు వ్యాధి నిరోధక టీకాలు టీడీపీ హయాంలో ఉచితంగా వేయిస్తే ఇప్పుడు ఏకంగా రద్దు చేశారన్నారు. యాదవుల‌కు జగన్ రెడ్డి దగా చేశారని విమర్శించారు. జగన్ యాదవ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారన్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో రూపాయి కూడా ఖర్చు చేసింది లేదన్నారు. యాదవులపై జగన్ పాలనలో అనేక దాడులు దౌర్జన్యాలు జరిగాయన్నారు. యాద‌వుల సంక్షేమ ప‌థ‌కాలు ర‌ద్దు చేశారని... యాద‌వ కార్పొరేష‌న్ నిధులివ్వ‌ని జ‌గ‌న్ యాద‌వుల‌పై క‌క్ష క‌ట్టి మ‌రీ దాడులు చేయించారని.. అక్ర‌మ కేసులు బ‌నాయించారని మండిపడ్డారు. పెళ్లిలో అక్షింతలు వేశారనే నెపంతో యనమల రామకృష్ణుడిపై అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. అసెంబ్లీ సాక్షిగా బీదా రవిచంద్ర యాదవ్‌పై దాడికి పాల్పడ్డారన్నారు. బచ్చుల అర్జునుడిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు. పల్లా శ్రీనివాస్, అతని సోదరుని ఆస్తుల్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని... పశువుల మేపకం కోసం బంజరు భూములు కేటాయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 16 , 2023 | 04:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising