CM JAGAN MVV Satyanarayana: జగన్‌తో విశాఖ ఎంపీ ఫ్యామిలీ భేటీ
ABN, First Publish Date - 2023-06-19T16:40:42+05:30
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం సమావేశమైంది. ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆడిటర్ జీవీ, పలువురు ముఖ్య నేతలు జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిడ్నాప్, తదనంతరం పరిణామాలపై సీఎంతో చర్చిస్తున్నారు
తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో (CM JAGAN) విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) కుటుంబం సమావేశమైంది. ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆడిటర్ జీవీ, పలువురు ముఖ్య నేతలు జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిడ్నాప్, తదనంతరం పరిణామాలపై సీఎంతో చర్చిస్తున్నారు.
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రెండు రోజుల పాటు ఎంపీ కుటుంబ సభ్యులను రౌడీషీటర్ హేమంత్‌తో పాటు పలువురు దుండగులు బంధించి హింసించారు. అనంతరం కోటి 75 లక్షల వరకు నగదు చేతికి చిక్కించుకున్నారు. అయినా కూడా దుండగులు ఏ మాత్రం విడిచిపెట్టకుండా ఆస్తులు రాయాలంటూ అత్యంత దారుణంగా హించించారు. రెండ్రోజుల అనంతరం ఎంపీ సత్యనారాయణకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా దుండగులను పట్టుకుని బాధిత కుటుంబాన్ని రక్షించారు.
అయితే ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఒక ఎంపీ కుటుంబానికే రక్షణ లేకపోతే సామాన్య జనానికి ఈ ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తుందని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా విశాఖ భూకబ్జాలకు, గూండాలకు, రౌడీయిజానికి నిలయంగా మారిపోయిందని విపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. అంతేకాకుండా కిడ్నాప్‌పై విపక్ష నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
ప్రస్తుతం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఎంపీ కుటుంబ సభ్యులు సమావేశమై కిడ్నాప్, అనంతరం పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)కూడా పాల్గొన్నారు.
Updated Date - 2023-06-19T16:47:39+05:30 IST