ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vishnukumar Raju: అమరావతి రైతులను సీఎం జగన్ వంచించారు..

ABN, First Publish Date - 2023-03-31T10:42:47+05:30

విశాఖ (Visakha): అమరావతి రైతుల (Amaravathi Farmers) ఉద్యమానికి బీజేపీ (BJP) రాష్ట ఉపాధ్యక్షుడు విష్టుకుమార్ రాజు (Vishnukumar Raju) సంఘీభావం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖ (Visakha): అమరావతి రైతుల (Amaravathi Farmers) ఉద్యమానికి బీజేపీ (BJP) రాష్ట ఉపాధ్యక్షుడు విష్టుకుమార్ రాజు (Vishnukumar Raju) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వంచించారని...దారుణంగా మోసం చేశారని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ జగన్ గెలిస్తే.. రాష్ట్రం ఎడారి అవుతుందన్నారు. వైసీపీ నేతలు (YCP Leaders) విశాఖలో విలువైన ఆస్తులు దోచుకోవడానికే పరిపాలన రాజధాని అంటున్నారని ఆరోపించారు. అమరావతే రాష్ట్రానికి ఎకైక రాజధాని అని.. ఇదే బీజేపీ విధానమని, మూడు రాజధానులకు (Three Capitals) బీజేపీ మద్దతులేదని విష్టుకుమార్ రాజు స్పష్టం చేశారు.

కాగా అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజులు గడిచాయి. రైతులు తమ భూమిని అమరావతి రాజధాని కోసం ఇచ్చారు. దాన్ని సీఎం జగన్ (CM Jagan) నిర్వీర్యం చేస్తుంటే తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చారు. అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. భూములు ఇచ్చి మరీ రోడ్డున పడ్డా.. మొక్కవోని పట్టుదలతో పోరాడుతున్నారు. కరోనా.. ప్రభుత్వ నిర్బంధాలు వారిని ఏమీ చేయలేకపోయాయి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఓ వైపు ఉద్యమం చేస్తూ.. రాజధానిని నిర్వీర్యం చేయడానికి జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ కుట్ర చేస్తోంది.

Updated Date - 2023-03-31T10:42:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising