AP News: ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను భార్యే స్వయంగా...
ABN, First Publish Date - 2023-08-23T14:40:02+05:30
ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది.
అనకాపల్లి: ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. వివాహతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. అప్పలనాయుడు, జానకి దంపతులు అనకాపల్లిలో జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య జానకి మరొకరితో వివాహేతర సంబంధం భర్త ప్రాణాలను బలితీసుకుంది. పధకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించింది. ప్రియుడిని తరచూ కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడని భర్త అప్పలనాయుడును భార్య జానకి హతమార్చింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియుడు రాము, భార్య జానకి పధకం ప్రకారమే అప్పలనాయుడుని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. ప్రియుడు రాము, భార్య జానకి కలిసి అప్పలనాయుడు తలపై సుత్తి, రాయితో బలంగా కొట్టి హతమార్చారు. అయితే పోలీసులు రంగ ప్రవేశంతో జానకి బాగోతం బట్టబయలైంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - 2023-08-23T14:40:02+05:30 IST