ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viveka Case : రాజకీయ వైరంతోనే వివేకా హత్య

ABN, First Publish Date - 2023-09-03T02:44:44+05:30

మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి,

హత్యకు అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి కుట్ర

గుండెపోటు అంటూ కట్టుకథ ప్రచారం

వివేకా వెంట వాహనంలో ప్రయాణిస్తూనే

హంతకుడు సునీల్‌కు గంగిరెడ్డి ఫోన్‌..

ఆ సమయంలో అతడు అవినాశ్‌ ఇంట్లోనే..

సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ పునరుద్ఘాటించింది. రాజకీయ వైరమే ఈ కుట్రకు కారణమని తెలిపింది. వివేకా హత్య కేసులో అవినాశ్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లో సీబీఐ తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో అవినాశ్‌ రెడ్డి పాత్రను స్పష్టంగా వెల్లడించింది. పూర్తి వివరాలు... వివేకానంద రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆయనకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, డీ శివశంకర్‌ రెడ్డి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఏర్పడ్డాయి. దాంతో వివేకాను హత్య చేయడానికి అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి కుట్రపన్నడం మొదలుపెట్టారు. శివశంకర్‌రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్‌ రావాలని భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి కోరుకోగా... ఆ టికెట్‌ వివేకానందరెడ్డికి వచ్చింది. పగ పెంచుకున్న వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాకు వెన్నుపోటు పొడిచారు. ఫలితంగా 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి చెందారు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, టీ గంగిరెడ్డి వెన్నుపోటు పొడిచారని గ్రహించిన వివేకా, వారి నివాసాలకు వెళ్లి తిట్టారు. సుదీర్ఘకాలం అనుచరుడిగా ఉన్న గంగిరెడ్డిపై వివేకా విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయనను కూడా పలుసార్లు వివేకా తిట్టారు.

ఎంపీ సీటు విషయంలోనూ..

2019 లోక్‌సభ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ అవినాశ్‌ రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్‌ షర్మిలకు లేదా వైఎస్‌ విజయమ్మకు రావాలని వివేకా కోరుకున్నారు. ఆ ఏడాది మార్చి 20న అవినాశ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే, టికెట్‌ విషయంలో వివేకా ఆలోచనను అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి అంచనా వేయలేదు. వివేకా ఆలోచన పట్ల వారు సంతోషంగా లేరు. ఈ క్రమంలో వివేకా హత్యకు వారు కుట్ర చేశారని ప్రాసంగిక సాక్ష్యం సంకేతమిస్తోంది. ఆ తర్వాత హత్య కోసం గజ్జెల ఉమాశంకర్‌ రెడ్డి, షేక్‌ దస్తగిరి,, యాదాటి సునీల్‌ యాదవ్‌ను రంగంలోకి దించారు.

ఆ నలుగురే కుట్రదారులు

హత్యా ప్రణాళిక వెనుక అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి, డి.శివశంకర్‌ రెడ్డి ఉన్నారని అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వాంగ్మూలంలో చెప్పారు. వివేకాను హత్యచేస్తే తనకు రూ.40కోట్లు ఇస్తానని శివశంకర్‌ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. హత్య చేసినా ఆందోళన చెందవద్దని, అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శిశంకర్‌ రెడ్డి అన్నీ చూసుకుంటారని గంగిరెడ్డి తమతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారు. తాను, టీ గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, గజ్జెల ఉమాశంకర్‌ రెడ్డి కలిసి హత్య చేశామని, ఆ తర్వాత అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి, గంగిరెడ్డి సమక్షంలో వారి సూచనలతో సాక్ష్యాధానాలను చెరిపివేశామని షేక్‌ దస్తగిరి అంగీకరించారు.


అవినాశ్‌ ఇంట్లో ఉన్న సునీల్‌కు గంగిరెడ్డి ఫోన్‌..

2019 మార్చి 14న ప్రచారానికి వెళ్లిన వివేకానంద రెడ్డి వెంట గంగిరెడ్డి ఉన్నారు. వివేకాతో ఉన్నప్పుడే సాయంత్రం ఆరు, ఏడు గంటల మధ్య రెండుసార్లు సునీల్‌ యాదవ్‌కు గంగిరెడ్డి ఫోన్‌ చేశారని దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో సునీల్‌ యాదవ్‌ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి నివాసంలో ఉన్నట్లు ఫొరెన్సిక్‌ విశ్లేషణలో తేలింది. ఆ రోజు సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు అవినాశ్‌ రెడ్డి, 7 గంటల 15 నిమిషాలకు శివశంకర్‌ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. 7.58గంటలకు గంగి రెడ్డికి శివశంకర్‌ రెడ్డి ఫోన్‌ చేశారు. ఆ సమయంలో ఇంకా పులివెందులకు చేరుకోని వివేకా వెంట గంగిరెడ్డి ఉన్నారు. 8.30గంటలకు పులివెందులకు చేరుకున్న దస్తగిరి, తన కోసం వేచిచూస్తున్న సునీల్‌ యాదవ్‌ను కలుసుకున్నారు. గంగిరెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి, షేక్‌ దస్తరిగితో మొబైల్‌ ఫోన్‌లో సునీల్‌ యాదవ్‌ టచ్‌లో ఉన్నాడు. వారి మధ్య అనేక మెసేజ్‌లు నడిచాయి. శివశంకర్‌ రెడ్డి, గంగిరెడ్డి, అవినాశ్‌ రెడ్దితో తరచూ కాంటాక్ట్‌లో ఉన్నాడు. నిఘా వేయడానికి వివేకా నివాసానికి 200 మీటర్ల దూరంలో షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌ ఉన్నారు. రాత్రి 11 గంటల 50 నిమిషాలకు వారితో ఉమాశంకర్‌ రెడ్డి కలిశారు. రాత్రి 9.39 గంటల నుంచి 10.28 గంటల మధ్య అవినాశ్‌ రెడ్డి నివాసానికి సునీల్‌ యాదవ్‌ వెళ్లినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. రాత్రి 11.25 నిమిషాలకు తన డ్రైవర్‌తో కలిసి వివేకా నివాసానికి చేరుకున్నారు. దాదాపు 11.45 గంటల ప్రాంతంలో గంగి రెడ్డి లోనికి వెళ్లారు. ఆ తర్వా త కొద్ది గంటల్లోనే వివేకా హత్యకు గురయ్యారు. హత్యచేసి పారిపోతున్నవారిని వాచ్‌మెన్‌ రంగన్న చూశారు.

గూగుల్‌ టేక్‌ అవుట్‌లో దొరికిపోయారు: గూగుల్‌ టేక్‌అవుట్‌ ఫొరెన్సిక్‌ విశ్లేషణ ప్రకారం... మార్చి 15న అర్ధరాత్రి దాటాక, 1.58 గంటలకు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి నివాసంలో సునీల్‌ యాదవ్‌ ఉన్నారు. వివేకా నివాసం పరిసరాల్లోని ఒక దుకాణం సీసీటీవీ వీడియోఫూటేజిని పరిశీలిస్తే... అర్ధరాత్రి 3.15 నిమిషాలకు ఉమాశంకర్‌ రెడ్డి రోడ్డుపై పరిగెత్తుతున్నట్లు కనిపించింది. వివేకాహత్య వార్త బయటికి రాక ముందే ఆ రోజు తెల్లవారుజామున అవినాశ్‌ రెడ్డి నివాసంలో శివశంకర్‌ రెడ్డి ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివేకా మృతదేహాన్ని చూసిన వెంటనే వివేకా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. పైగా గుండెపోటుతో వివేకా మరణించారని కట్టుకథను ప్రచారం చేశారు. అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.

Updated Date - 2023-09-03T09:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising