ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CPM Protest: విజయనగరంలో గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం వినూత్న నిరసన

ABN, First Publish Date - 2023-03-02T14:09:10+05:30

గ్యాస్ ధరలను పెంచుతూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయనగరం: గ్యాస్ ధరలను పెంచుతూ మోదీ ప్రభుత్వం (Modi Government) తీసుకున్న నిర్ణయంపై సీపీఎం (CPM) తీవ్రస్థాయిలో మండిపడింది. గ్యాస్ ధరల పెంపునకు నిరసన జిల్లాలో సీపీఎం నేతలు (CPM Leaders) వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పలు కాలనీల్లో మహిళలు గ్యాస్ బండలను గర్టీలతో(spoons) గట్టిగా కొడుతూ గంటపాటు నగరంలో హోరెత్తించారు. దేశ ప్రజలపై భారాలు మోపుతూ వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు (CPM Leader Reddy Shankar Rao) మాట్లాడుతూ.. మోదీ బీజేపీ ప్రభుత్వం ప్రజలు, మధ్య తరగతి ఉద్యోగులపై భారాలు వేసి పెట్టుబడిదారులు, ఆదాని, అంబానీలకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి మోదీ (PM Modi) దోపిడీదారుల పక్షమని నిరూపించుకున్నారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, లేదంటే దేశప్రజలు బీజేపీ ప్రభుత్వాని (BJP Government)కి తగిన బుద్ధి చెపుతారని హెచ్చిరించారు. ఈ కార్యక్రమంలో రమణమ్మ, శాంతమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T14:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!