ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : ఇది మరో వలంటీర్ బాగోతం.. వరద సాయం పంపిణీలో కూడానా..!

ABN, First Publish Date - 2023-08-04T09:23:36+05:30

వలంటీర్ల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. రోజుకొకరి బాగోతం వెలుగు చూస్తోంది. అవసరం కోసం జాబ్ తెచ్చుకుని కష్టపడి చేసేవాళ్లు లేకపోలేదు. కానీ కొందరి పనితీరు కారణంగా మొత్తం వలంటీర్ వ్యవస్థకే మచ్చ వస్తోంది. వరద సహాయం పంపిణీలో వలంటీర్ చేతివాటం చూపిన ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది.

అల్లూరి జిల్లా : వలంటీర్ల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. రోజుకొకరి బాగోతం వెలుగు చూస్తోంది. అవసరం కోసం జాబ్ తెచ్చుకుని కష్టపడి చేసేవాళ్లు లేకపోలేదు. కానీ కొందరి పనితీరు కారణంగా మొత్తం వలంటీర్ వ్యవస్థకే మచ్చ వస్తోంది. వరద సహాయం పంపిణీలో వలంటీర్ చేతివాటం చూపిన ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది. ప్రభుత్వం మంజూరు చేసిన రెండు వేల రూపాయిల్లో వెయ్యి రూపాయలు నొక్కేశాడు. అల్లూరి జిల్లా కూనవరం మండలం టేకులబోరు పన్నెండవ వార్డులో వలెంటీర్ కొవ్వాసి ముత్యాలరావు వరద సాయం పంపిణీలో లబ్దిదారులకు ఇవ్వాల్సిన రూ.2 వేలల్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చేసి మరో వెయ్యి నొక్కేశాడు. వృద్ధురాలు అయిన అల్లారి పుష్పవేణితో పాటు మరికొంత మందికి వెయ్యి రూపాయలు మాత్రమే వలంటీర్ పంపిణీ చేశాడు. స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో వలంటీర్ బాగోతం వెలుగు చూసింది. బాధితులు తహసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-08-04T09:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising