ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case: ఎంపీ టికెట్ కోసం మా నాన్నను హత్య చేసినట్లు భావిస్తున్నాం: సునీతా

ABN, First Publish Date - 2023-03-13T17:14:35+05:30

మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Case)లో ఆయన కుమార్తె సునీతారెడ్డి (Sunitha Reddy) హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Case)లో ఆయన కుమార్తె సునీతారెడ్డి (Sunitha Reddy) హైకోర్టులో వేసిన ఇంప్లిడ్ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. ఎంపీ అవినాశ్‌‌రెడ్డి (MP Avinash Reddy) ద్వారానే దస్తగిరితో పాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. వివేకా హత్యకు ముందు అవినాశ్‌ ఇంట్లోనే సునీల్‌యాదవ్ ఉన్నాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే ఓడించారని, 2019లో వివేకాకు ఎంపీ టికెట్ ఇస్తున్నారనే హత్య చేశారని తెలిపారు. ఎంపీ టికెట్ కోసం హత్య చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి (MV Krishna Reddy) చెప్పే ముందే హత్య గురించి అవినాశ్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు.

అవినాశ్‌ ఆధారాలు లేని ఆరోపణలు

‘‘వివేకా మరణవార్తను మూడోవ్యక్తి ద్వారా తెలుసుకోవాలని వేచిచూశారు. వివేకా మరణంపై అవినాశ్‌కు శివప్రకాశ్‌రెడ్డి సమాచారం ఇచ్చాడు. వివేకా ఇంటికి వచ్చిన శశికళకి గుండెపోటు (Heart Attack)తో చనిపోయినట్లు అవినాశ్‌ చెప్పాడు. పోలీసులు కూడా వివేకా గుండెపోటుతో పాటు రక్తపు వాంతులతో చనిపోయినట్లు అబద్ధం చెప్పారు. హత్య కాదు.. సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాశ్‌ చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. విచారణకు సహకరించకుండా కోర్టుల్లో అవినాశ్‌ తప్పుడు కేసులు వేస్తున్నాడు. నాపై, నా కుటుంబంపై, దర్యాప్తు అధికారులపై అవినాశ్‌ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు. ఏపీ ప్రభుత్వ అధికారులు అవినాశ్‌ను కాపాడాలని చూస్తున్నారు. సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారు’’ అని సునీతారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-13T17:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising