ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh Padayatra: రైతును రాజును చేసి చూపిస్తాం: నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-02-21T21:18:57+05:30

రైతు రాజ్యం తెస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి చివరికి అన్నపూర్ణగా పిలిచే ఏపీని రైతులేని రాజ్యంగా మార్చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి: రైతు రాజ్యం తెస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి చివరికి అన్నపూర్ణగా పిలిచే ఏపీని రైతులేని రాజ్యంగా మార్చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) దుయ్యబట్టారు. శివరాత్రి పర్వదినం, నందమూరి తారకరత్న మృతి నేపథ్యంలో మూడు రోజుల విరామం అనంతరం మంగళవారం తిరిగి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆయన యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)ను ప్రారంభించారు. వైసీపీ (YCP) ప్రభుత్వం అడుగడునా పెడుతున్న అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగారు. శ్రీకాళహస్తి (Srikalahasti) మండలం తొండమానుపురం పంచాయతీలో పాదయాత్ర 300 కిలోమీటరు మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని 13 గ్రామాల దాహార్తి తీర్చే రక్షితమంచినీటి పథకాన్ని టీడీపీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ఏర్పాటుచేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. ఈ మేరకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనికి ముందు మైనారిటీలు, వన్యకుల క్షత్రియులతో సమావేశమయ్యారు. పాదయాత్ర దారిలోని వరిపొలంలో పురుగులు మందు పిచికారీ చేస్తున్న రైతులు, వేరుశనగ కూలీలతో మాట్లాడారు.

రైతులకు పెట్టుబడులు తగ్గించేలా చర్యలు

‘మందు కొడితే పురుగులు చావడంలేదు. జగన్‌ బ్రాండ్‌ మద్యం కొడితే పురుగులు కచ్చితంగా చస్తాయి. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. పండిన పంటకు గిట్టుబాటు ధరలేదు. రూ.3500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఆ నిధి ఏమైంది? వైసీపీ ప్రభుత్వం వేస్తున్న పన్నుల వల్లే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్‌ ధర ఆకాశానికి చేరింది. ప్రజలపై పన్ను భారం తగ్గించాలి. సామాన్యులు, పేదవారు బతికే పరిస్థితి లేదు. టీడీపీ వచ్చిన వెంటనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. పెట్టుబడి తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. పన్నుల భారం తగ్గించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాం’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

రైతాంగాన్ని గాలికొదిలేసిన కాకాణి

‘నేను మంత్రిగా ఉన్నప్పుడు 25 వేల కిమీ సీసీ రోడ్లు, లక్షలాది ఎల్‌ఈడీ లైట్లు వేశాం. నేడు వైసీపీ వాళ్లంతా మనం వేసిన రోడ్ల మీద, లైట్ల వెలుతురులో నడుస్తున్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోర్టులో దొంగతనం చేసి, సీబీఐ గొడవల్లో చిక్కుకుని రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. టీడీపీ పాలనలో అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించారు. గోపాల మిత్రలకు వేతనాలు ఇవ్వడం లేదు. పశువులకు వైద్య ఖర్చులు పెరిగిపోయాయి. రైతాంగాన్ని మేం పూర్తిస్థాయిలో ఆదుకుంటాం’ అని లోకేశ్‌ భరోసానిచ్చారు.

Updated Date - 2023-02-21T21:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising