ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Love Marriage: ప్రేయసిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు.. కానీ ఆ మాటే..!

ABN, First Publish Date - 2023-09-05T02:59:56+05:30

అమ్మా నన్ను క్షమించు. నా భార్యను ప్రాణంకంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ, పెళ్లయిన మూడు నెలలకే అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ నాకు నరకం చూపిస్తోంది. స్టేషన్‌లో కేసులు పెట్టించి వేధిస్తోంది.

అమ్మా.. నన్ను క్షమించంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లేఖ

భార్య, పోలీసుల వేధింపులతో దారుణం

దెందులూరు, సెప్టెంబరు 4: ‘అమ్మా నన్ను క్షమించు. నా భార్యను ప్రాణంకంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ, పెళ్లయిన మూడు నెలలకే అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ నాకు నరకం చూపిస్తోంది. స్టేషన్‌లో కేసులు పెట్టించి వేధిస్తోంది. ఇప్పటికప్పుడు పది లక్షల నగదు, విడాకులు కావాలంటూ పోలీసులతో వేధిస్తోంది. వీటిని భరించలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా.. నా ఆత్మహత్య తర్వాతైనా నా భార్య (ప్రేయసి) నా ప్రేమ తెలుసుకుంటుందని ఆశిస్తూ.. నీ కుమారుడు తేజోమూర్తి’ అంటూ ఓ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి, రైలు కింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

వివరాలివీ.. దెందులూరుకు చెందిన చక్కా తేజోమూర్తి(26) బీటెక్‌ చేసి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్లుగా ఏలూరుకు చెందిన ప్రియాంకతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మూడు నెలల క్రితం హైదరాబాద్‌ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇది జరిగిన రెండో రోజే తేజోమూర్తికి అక్రమ సంబధాలు ఉన్నాయంటూ ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. వరలక్ష్మీ వ్రతం రోజు జరిగిన ఘర్షణలో భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉండటం వల్లే తనను వేధిస్తున్నాడని ఏలూరు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఆమె కేసు పెట్టింది. సీఐ ఎన్‌.రాజశేఖర్‌.. తేజోమూర్తి పెద్దలతో మాట్లాడారు. ఆదివారం రాత్రి జరిగిన పంచాయితీలో తెల్లవారేలోపు పది లక్షలు తీసుకువచ్చి, ఆమెకు విడాకులు ఇవ్వాలని, లేకుంటే తేజోమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తానని సీఐ బెదిరించినట్లు తేజోమూర్తి బాబాయి చక్కా బుజ్జి చెబుతున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వచ్చిన తేజోమూర్తి 8 పేజీల సూసైట్‌ నోట్‌ రాసి, తెల్లవారుజామున రెండుగంటల సమయంలో మోటారు సైకిల్‌పై దెందులూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా, భార్యాభర్తలిద్దరూ కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వకుండా పదే పదే కౌన్సెలింగ్‌ పేరిట సీఐ వేధించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-09-05T14:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising