ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kaikaluru MLA: ఏలూరు అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే ఆగ్రహం

ABN, First Publish Date - 2023-10-20T15:58:21+05:30

ఏలూరులో అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరు: ఏలూరులో అధికారుల తీరుపై కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులో ఎంపీ శ్రీధర్ అధ్యక్షతన పార్లమెంటు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కైకలూరు నియోజకవర్గంలో శివారు భూములకు సాగునీరు అందడం లేదంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల దృష్టికి పలుమార్లు చూపించినా పట్టించుకోలేదని తీవ్ర ఆగ్రహం చేశారు. దీంతో ఎంపీ శ్రీధర్‌, జాయింట్ కలెక్టర్‌లు కలిసి ఎమ్మెల్యేకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించలేకపోతే.. నేనేందుకు.. అవసరమైతే రాజీనామా చేసి రైతుల కోసం పోరాడుతా’’ అంటూ హెచ్చరించారు. కృష్ణా డెల్టా ఇరిగేషన్ అధికారుల తీరుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. చివరకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.

Updated Date - 2023-10-20T15:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising