ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harirama Jogaiah: ఎన్డీఏ భేటీకి జనసేనాని హాజరుపై హరిరామ జోగయ్య లేఖ.. ఏముందంటే..!

ABN, First Publish Date - 2023-07-19T17:29:50+05:30

రాబోయే ఎన్నికల్లో పవన్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, జగన్‌ను ఓడించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చు.

పశ్చిమగోదావరి జిల్లా: ఎన్డీఏ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకావడంపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య (Harirama Jogaiah) లేఖ రాశారు. లేఖలో ఏముంది అంటే.. ‘‘రాబోయే ఎన్నికల్లో పవన్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, జగన్‌ను ఓడించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చు. నీతివంతమైన పరిపాలన చేస్తున్న మోడీ చరిష్మా, బీజేపీ, జనసేన కూటమికి ఉపయోగపడవచ్చు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చక పోవడం వల్ల బీజేపీకి సానుకూల పరిస్థితి లేదు. బీజేపీకి మత రాజకీయాల వల్ల కూడా నష్టం కలగజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి బీజేపీతో జనసేన పొత్తు ఎంతవరకు లబ్ధి చేస్తుందని కాలమే చెప్పాలి. జనసేనతో బీజేపీ పొత్తు జనసేనకు కంటే బీజేపీకే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. చంద్రబాబు పరిపాలన దక్షిత, జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉంది. టీడీపీ హయంలో జరిగిన అవినీతి, రంగా హత్య వంటి అంశాలు జనసేనపై ఆ ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. పూర్తి కాలం చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడనే వైసీపీ చేసే ప్రచారానికి గురికావాల్సి వస్తుంది.’’ అని లేఖలో హరిరామ జోగయ్య పేర్కొన్నారు.

Updated Date - 2023-07-19T17:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising