AP News: చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్
ABN, First Publish Date - 2023-09-29T15:55:37+05:30
ద్వారకాతిరుమల బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది.
ఏలూరు: ద్వారకాతిరుమల (Dwaraka tirumala Temple) బ్రహ్మోత్సవాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. వచ్చేనెల 24 నుంచి 29 వరకు చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు జరుగనుంది. 8 రోజులు జరగాల్సిన ఆశ్విజ మాస బ్రహ్మోత్సవాలు 6 రోజులకు కుదించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాక 5వ రోజు పౌర్ణమి నాడు స్వామి వారి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రావడంతో ఒకరోజు ముందుగానే స్వామి వారి కళ్యాణం జరిగేలా అర్చకులు నిర్ణయం తీసుకున్నారు. 28న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. 29న ఉదయం ఆలయం తెరిచి శుద్ధి అనంతరం వసంతోత్సవం, రాత్రి పవళింపు సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Updated Date - 2023-09-29T15:55:37+05:30 IST