Raghurama: వివేకా కేసులో వారిద్దరినీ విచారిస్తే A9 ఎవరనేది తెలుస్తుంది..!?
ABN, First Publish Date - 2023-06-09T17:27:58+05:30
సునీత లాంటి కూతురు ఉంటే బాగుంటుందని అనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
ఢిల్లీ: సునీత లాంటి కూతురు ఉంటే బాగుంటుందని అనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్.వివేకా హత్య కేసులో సునీత రెడ్డి ఒంటరి పోరాటం చేస్తోందని తెలిపారు. ‘‘బెయిల్ గొడవలు నడుస్తున్నాయి. నేటి బెయిల్ ఆటలో విజేతలెవరో! అవినాష్ రెడ్డి బెయిల్ కేసు మంగళవారం విచారణకు రాబోతుంది.. చూడాలి ఏమవుతుందో? అవినాష్ రెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి.. తండ్రి భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ రావొచ్చు. భాస్కర్ రెడ్డి అంశంలో సీబీఐ లాయర్ బెయిల్ ఇవ్వొద్దు అని పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో మాత్రం అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేసినట్టు లేదు. సునీల్ యాదవ్ దాదాపు 30 సార్లు అవినాష్ నివాసానికి వచ్చి వెళ్ళారు? గూగుల్ టేక్‌ఔట్‌లో అన్ని రికార్డ్ అయ్యాయి. బహుశా గూగుల్ టేక్‌ఔట్ ఉన్నట్టు తెలియదు. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఈ ముగ్గురే కీలకం. ప్లాన్ చేసింది కూడా ఈ ముగ్గురే అని అంటున్నారు.’’ అని చెప్పుకొచ్చారు.
‘‘వివేకా కేసులో A9 ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద అనుమానం. జగన్మోహన్ రెడ్డికి వివేకా హత్య విషయం ఉదయం తెలుసు అని సీబీఐ పేర్కొంది. ఉదయం 5.15కి హత్య విషయం తెలిసిందని అంటున్నారు. అవినాష్ రెడ్డి మర్డర్ ఎలా చేస్తాడు అని జగన్ అసెంబ్లీలో చెప్పారు. భారతి పీఏను సీబీఐ గతంలో విచారించింది. జగన్మోహన్ రెడ్డిని, వారి శ్రీమతిని విచారించనదే ఇతర అంశాలు బయటకు రావు. వారికి ముందే వివేకా హత్య అంశాన్ని ఎవరు చెప్పారు. ఫోన్‌లో ఎవరితో మాట్లాడారో తెలియాల్సి ఉంది.’’ అని రఘురామ డిమాండ్ చేశారు.
‘‘గుంటూరులో దొంగ ఓట్లను ఎక్కువగా నమోదు చేశారు వైసీపీ పార్టీ వాళ్లు. ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి.. దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. వీలైతే ఓట్లను పరిశీలించండి. జగన్ క్రిస్టియన్ అని ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ఉంది. బహుశా అందుకే బి.టెక్ రవి జగన్మోహన్ రెడ్డిని రెడ్డే కాదని అని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి చర్చికి వెళ్తారు కాబట్టే బీటెక్ రవి అలా అని ఉండొచ్చు.’’ అని చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-06-09T17:27:58+05:30 IST