Eluru Dist.: పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసుల దాడి
ABN, First Publish Date - 2023-10-15T10:46:49+05:30
ఏలూరు జిల్లా: పెదవేగి మండలం చక్రాయగూడెం సమీపంలో పేకాట, కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా ఈ స్థావరాలను వైసీపీ ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరులు నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం.
ఏలూరు జిల్లా: పెదవేగి మండలం చక్రాయగూడెం సమీపంలో పేకాట (Poker), కోడిపందాల (Kodi Pandalu) స్థావరాలపై పోలీసులు (Police) దాడి చేశారు. కొంతకాలంగా ఈ స్థావరాలను వైసీపీ (YCP) ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరులు నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడిలో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. 100కుపైగా ద్విచక్రవాహనాలు, 30కు పైగా కార్లు స్వాధీనం చేసుకున్నారు. 60 మందికిపైగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాక తెలుసుకున్న వైసీపీకి చెందిన డెన్ నిర్వాహకులు పరారయ్యారు. అయితే లక్ష రుపాయలు మాత్రమే దొరికినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కేసును మాఫీ చేయాలంటూ పోలీసు అధికారులపై వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-10-15T10:46:49+05:30 IST