ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Politics : టీడీపీ ఎమ్మెల్యే భర్త అరెస్ట్.. రాజమండ్రిలో హై టెన్షన్..

ABN, First Publish Date - 2023-04-30T12:32:58+05:30

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని (TDP MLA Adireddy Bhavani) భర్త ఆదిరెడ్డి వాసును (Adireddy Vasu) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాసుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును (Adireddy Apparao) కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాసు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తండ్రీ, కుమారుడు ఇద్దర్నీ రాజమండ్రి సీఐడీ కార్యాలయానికి పోలీసులు తరలించారు. అయితే ఈ ఇద్దర్ని ఏ విషయంలో అరెస్ట్ చేశారనే విషయం తెలియట్లేదు. చిట్ ఫండ్ కేసు (Chit Fund Case) లో అరెస్ట్ చేశారా..? లేకుంటే మరో కేసులో అరెస్టు చేశారా..? అనే దానిపై స్పష్టత రాలేదు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ నేతలు (TDP Leaders) సీఐడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అటు అరెస్ట్.. ఇటు ఆందోళనతో రాజమండ్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ అరెస్టుపై టీడీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసుల అక్రమ అరెస్ట్‌ను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా ఖండించారు. అయితే వాళ్లను ఎందుకు అరెస్టు చేశారో అర్థం కావట్లేదని చెబుతున్నారు. సీఐడీ కార్యాలయం లోపలికి ఎవరినీ రానివ్వడంలేదని నేతలు చెబుతున్నారు. కాగా.. గతంలో వాళ్లపై చిట్ ఫండ్‌కు సంబంధించి జీఎస్టీ కేసు పెట్టారని, అప్పట్లో ఈ కేసులో బెయిల్ కూడా తెచ్చుకున్నారని, హైకోర్టు నుంచి ‘నాట్ టూ అరెస్టు’ ఆర్డర్ కూడా తీసుకున్నారని నేతలు చెబుతున్నారు. మరి ఇప్పుడు వేరే కేసు ఏమన్నా పెడుతున్నారా..? లేక ఇది కక్ష సాధింపు చర్య అనేది తెలియడంలేదన్నారు. టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇది కూడా ఒకటని అనుకుంటున్నామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-30T13:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising