Pattabhi: 17ఏపై సుప్రీం డైరక్షన్‌కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది
ABN, First Publish Date - 2023-11-08T11:22:01+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ నేత కొమ్మరెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును (TDP Chief Chandrababu Naidu) ఎదుర్కోలేక రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఆధారాలు లేని తప్పుడు కేసులు పెట్టారని ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు క్షేమంగా బయటికి రావాలని కొన్ని కోట్ల మంది ప్రజలు దేవుళ్లను మొక్కుకున్నారన్నారు. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరల ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో (Supreme Court) చంద్రబాబు అప్పీల్ చేసిన క్వాష్ పిటిషన్ తీర్పు ఈరోజో రేపో వెలువడనుందన్నారు. 17ఏ గురించి సుప్రీంకోర్టు ఇచ్చే డైరెక్షన్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. చట్టాలను ఉల్లంఘించడం సీఎం జగన్‌కు (CM Jagan) వెన్నతో పెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు.
Updated Date - 2023-11-08T11:37:39+05:30 IST