ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nimmala Ramanaidu: అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం..

ABN, First Publish Date - 2023-03-18T13:25:38+05:30

అమరావతి: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) హయాంలో 85 శాతం పూర్తి అయిన టిడ్కోఇళ్ల (Tidco houses) నిర్మాణం పూర్తి చేసి పేదలకు ఇవ్వలేని సీఎం జగన్ (CM Jagan) 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.

సొంతిళ్లులేక పేదలు అవస్థలు పడుతుంటే, ముఖ్యమంత్రి జగన్ వారిని కల్లబొల్లి మాటలతో వంచిస్తున్నారని విమర్శించారు. సీఎం చెబుతున్న ఇళ్ల నిర్మాణం.. సెంటుపట్టాల పంపిణీ, జగనన్న ఊళ్లు అంతా బోగస్ అని విమర్శించారు. చంద్రబాబు హాయాంలో 85 శాతం పూర్తి అయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి, ఆఖరి ఏడాదిలో అయినా జగన్ పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

శాసనసభలో (Assembly) టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక మంత్రులు అవస్థలుపడుతుంటే, స్పీకర్ మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకల్ని సభ నుంచి సస్పెండ్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు శాశ్వతంగా సస్పెండ్ చేయబోతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వ సస్పెన్షన్‌కు జనం సంసిద్ధులు అయ్యారనడానికి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే (MLC Elections Results) నిదర్శనమని రామానాయుడు వ్యాఖ్యానించారు.

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మండలిలో మంత్రి డ్రామాల రాంబాబు దీర్ఘాలు తీశారని, పోలవరంపై సీఎం చాలా చాలా ఏం చర్చించారో డ్రామాల రాంబాబు చెప్పాలని దీపక్ రెడ్డి (Deepak Reddy) అన్నారు. ఇరిగేషన్ మంత్రి, అధికారులు లేకుండానే జగన్ పోలవరంపై, ప్రధాని (PM)తో చర్చించారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు ఏం అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం మంత్రులు, ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని దీపక్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-03-18T13:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising