Alluri District: వట్టిగడ్డ గ్రామంలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2023-04-30T11:12:51+05:30
అల్లూరి జిల్లా (రాజమండ్రి): రాజవొమ్మంగి మండలంలోని వట్టిగడ్డ గ్రామంలో ఉద్రిక్తత (Tension) పరిస్థితులు నెలకొన్నాయి.
అల్లూరి జిల్లా (రాజమండ్రి): రాజవొమ్మంగి మండలంలోని వట్టిగడ్డ గ్రామంలో ఉద్రిక్తత (Tension) పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ జరగనున్న వైసీపీ (YCP) ప్రజాప్రతినిధుల సమావేశానికి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తున్న అనంతబాబుకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. దీంతో అనంతబాబు పర్యటనను అడ్డుకుంటామని ఆదివాసీలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బారీగా మోహరించారు.
కాగా గత ఏడాది మే నెలలో ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఏపీలో కలకలంరేపిన విషయం తెలిసిందే. పోలీసులు అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత.. అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నాడు. అనంతరం బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా సరే కోర్టులు తిరస్కరించాయి. అయితే ఆగస్టులో హైకోర్టు అనంతబాబుకు కండిషన్ బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి మరణించగా.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాజమండ్రి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత మళ్లీ జైలుకు వెళ్లాడు.
గతంలో పలుసార్లు అనంతబాబు రాజమండ్రి కోర్టు, హైకోర్టుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం పేర్కొన్న విషయం తెలిసిందే.
Updated Date - 2023-04-30T11:12:51+05:30 IST