ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Selfie Video: స్నేహితులు కొట్టారంటూ సెల్ఫీ వీడియోలో యువకుడి ఆవేదన.. చివరకు

ABN, First Publish Date - 2023-04-29T11:05:58+05:30

జిల్లాలోని యలమంచిలలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని యలమంచిలిలో విషాదం చోటు చేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ వద్ద బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి పొన్నపల్లి రామకృష్ణ (30) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణాన్ని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వివరించాడు. సంక్రాంతి సమయంలో జరిగిన వివాదంలో తన స్నేహితుడు తనని కొట్టాడని... ఆ మనస్థాపంతో చనిపోతున్నానని తెలిపాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ స్వగ్రామం నరసాపురం మండలం సీతారాంపురం. నిన్న ఉదయం చెప్పులు, సెల్ ఫోన్‌ను బ్రిడ్జిపై ఉంచి యువకుడు గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతంలో రామకృష్ణకు అతడి స్నేహితులకు మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణను అతడి స్నేహితులు కొట్టారు. దీంతో అప్పటి నుంచి యువకుడు తీవ్ర మనస్థాపంతో ఉన్నాడు. అంతేకాకుండా రామకృష్ణ అప్పట్లో ఓ ఆడియోను విడుదల చేశాడు. తనను తన స్నేహితులు కొట్టారని.. చాలా బాధగా ఉందంటూ ఓ ఆడియోను విడుదల చేశాడు. ఆ ఆడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నిన్న ఉదయం సెల్ఫీ వీడియో తీసుకున్న రామకృష్ణ.. స్నేహితులు కొట్టడంతో చాలా అప్సెట్ అయ్యాయని.. ఆ బాధతోనే చనిపోతున్నాను అంటూ వీడియోలో తెలిపాడు. అనంతరం చించినాడు వద్ద బ్రిడ్జిపై చేరుకున్న యువకుడు.. బ్రిడ్జిపై చెప్పులు, సెల్ ఫోన్‌ను ఉంచి గోదావరి నదిలోకి దూకేశాడు. అయితే ఆలస్యంగా వీడియోను గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి బ్రిడ్జి వద్దకు చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు ఉదయం రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. సెల్ఫీ వీడియో తీసుకుని రామకృష్ణ మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Updated Date - 2023-04-29T11:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising