Viveka Case: ‘జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తావు’
ABN, First Publish Date - 2023-04-16T21:01:42+05:30
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు కాబోతున్నాడని
జగ్గయ్యపేట: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Former Minister Vivekananda Reddy) హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు కాబోతున్నాడని, నైతిక బాధ్యత వహించి సీఎం జగన్‌రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆస్కార్ లెవల్లో ఒక కన్ను మరొక కన్నును పొడుస్తుందా, ఒక చేయి మరో చేయి నరుక్కుంటుందా అని సీఎం జగన్ (CM Jagan) నటించారని, ఇప్పుడేమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కోడి కత్తి కేసులోనూ వాస్తవాలు బయటకు వచ్చాయని, ఇంకెంతకాలం తాడేపల్లిలో దాక్కుంటారని, బయటకు వచ్చి నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పదవీలో కూర్చొనే హక్కు జగన్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులు దాటి వైసీపీ ఎమ్మెల్యేలకు చెందిన లారీల్లోనే ఇసుక తరలి పోతుందని, తమ పార్టీ నేతలు ఎన్నిసార్లు అడ్డుకున్నా అధికారులు తాము వెళ్లిపోగానే పంపిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఉదయం పులివెందుల (Pulivendula)లో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం అరెస్ట్ చేసిన అధికారులు.. ఇదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. భాస్కర్‌రెడ్డి (Bhaskar Reddy)కి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Updated Date - 2023-04-16T21:01:42+05:30 IST