ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP Minister: పార్టీ మార్పుపై మంత్రి విశ్వరూప్ స్పందన.. ఎవరైనా సీఎం కావచ్చంటూ..

ABN, First Publish Date - 2023-06-27T20:02:32+05:30

పార్టీ మార్పు ప్రచారంపై వైసీపీ మంత్రి విశ్వరూప్ (Ycp Minister Vishwarup) స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ: పార్టీ మార్పు ప్రచారంపై వైసీపీ మంత్రి విశ్వరూప్ (Ycp Minister Vishwarup) స్పందించారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని మంత్రి విశ్వరూప్ తెలిపారు. తిరుమలలో (Tirumala) తన మాటలను కొందరు వక్రీకరించి మీడియాలో కథనాలు ప్రసారం చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సీఎం కావచ్చని, ఓ వ్యక్తి అంటే కొంతమందికి ఆరాధ్య భావం ఉంటుందన్నారు. ఆ వ్యక్తిని తిట్టి.. తానెందుకు కొంతమందికి విలన్ అవ్వాలి?, తాను పదవుల కోసం పార్టీలోకి రాలేదని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు.

మాహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాలలోకి వచ్చానని, ఆయన శిష్యుడిగా జగన్‌కు మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనను మొదటి కాబినెట్‌లోకి తీసుకున్నారని, తరువాత ప్రమోషన్ ఇచ్చి రవాణా శాఖ ఇచ్చారని, రెండు పర్యాయాలు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు.

రాజకీయ పార్టీలను, ఆ నాయకులను తాను విమర్శించలేదు కాబట్టి తాను ఆ పార్టీల సానుభూతి పరుడిని అనుకోవడం వాస్తవం కాదన్నారు. కోనసీమలోని సామాజిక వర్గాలను సమన్వయం చేసుకోగలిగిన వారే ఇక్కడ రాజకీయం చేయగలడని, సామాజిక వర్గాలను కించ పరిచే ఉద్దేశ్యం తనకు ఉండదని మంత్రి చెప్పారు. బ్యాలెన్స్‌గా మాట్లాడుతానని, తిరుమలలో తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని మంత్రి స్పష్టం చేశారు.

కాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి విశ్వరూప్ (Minister Viswaroop) తిరుమల (Tirumala) వెంకన్న సాక్షిగా సంచలనానికి తెరదీశారు. శనివారం 24న తిరుమలలో విశ్వరూప్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నానన్నారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. సీఎం కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసి 88స్థానాల్లో గెలిస్తే సీఎం అవ్వొచ్చని తెలిపారు. పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలన్నారు. ప్రజాస్వామ్యంలో రెండు విధాలుగా సీఎం అవుతారని మంత్రి విశ్వరూప్ అన్నారు.

Updated Date - 2023-06-27T20:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising