ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Viveka Case: భాస్కర్ రెడ్డి అరెస్ట్.. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో నెట్టింట మరోసారి వైరల్‌గా మారిన లేఖ..!

ABN, First Publish Date - 2023-04-17T15:27:33+05:30

డ్రైవర్‌ తనను చచ్చేలా కొట్టాడంటూ వివేకానంద రెడ్డి రాసినట్లుగా భావిస్తున్న, అప్పట్లో బయటపడిన లేఖ తాజాగా ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్‌గా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఆంధ్రజ్యోతి): డ్రైవర్‌ తనను చచ్చేలా కొట్టాడంటూ వివేకానంద రెడ్డి రాసినట్లుగా భావిస్తున్న, అప్పట్లో బయటపడిన లేఖ తాజాగా ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్‌గా మారింది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ (YS Bhaskar Reddy Arrest) నేపథ్యంలో వివేకా హత్య కేసు (Viveka Murder Case) రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు. ఈ లెటరు రాయడానికి చాలా కష్టపడ్డాను. డ్రైవరు ప్రసాద్‌ను వదలి పెట్టవద్దు. ఇట్లు వివేకానంద రెడ్డి’ అని అప్పుడు బయటపడిన ఆ లేఖలో ఉండటం గమనార్హం. ఆ కాగితానికి రక్తపు మరకలు కూడా అంటాయి. వివేకా బంధువులే ఈ లేఖను పోలీసులకు అందించారు. ఆ తర్వాత పోలీసులు డ్రైవర్‌ ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులకు చెందిన ప్రసాద్‌ వివేకా హత్య జరిగిన నాటికి సరిగ్గా నెలన్నర కిందటే వివేకా వద్ద డ్రైవర్‌గా చేరారు. గురువారం (మార్చి 14, 2019) రాత్రి 11.30 గంటలకు వివేకాను ఇంటి వద్ద వదిలిపెట్టాడు. శుక్రవారం (మార్చి 15, 2019) ఉదయం 6.30 గంటలకు వివేకా మరణ వార్త బయటికి తెలిసింది. అదే రోజు సాయంత్రం జగన్‌ మీడియాతో మాట్లాడటానికి పది నిమిషాల ముందు వివేకానంద రెడ్డి బంధువులు డీఎస్పీ నాగరాజును కలిసి ఇంట్లో దొరికిందంటూ లేఖను అందించారు. మధ్యాహ్నం దాకా ‘వివేకా హఠాన్మరణం’ అనే ప్రచారం జరిగింది. డాక్టర్లు పోస్టుమార్టం చేసేటప్పుడు తలపై బలమైన గాయాలు, పదునైన ఆయుధంతో నరికిన గాట్లు కనిపించాయి. ఆ తర్వాతే దీనిని పోలీసులు హత్యగా నిర్ధారించారు.

Updated Date - 2023-04-17T15:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising