అవినాష్ తల్లి ఉపవాసాలు ఎక్కువ చేస్తుంది.. దీంతో లో బీపీ వచ్చింది..: జగన్ మేనత్త
ABN, First Publish Date - 2023-05-24T12:21:15+05:30
వైఎస్ వివేకా మంచిగా జీవించారని.. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని సీఎం జగన్ మేనత్త, వైఎస్సార్, వివేకానంద రెడ్డి సోదరి విమలారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన విమలారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని.. ఆమెను చూసి ప్రార్థన చేయడానికి వచ్చానని తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారన్నారు.
కర్నూలు : వైఎస్ వివేకా మంచిగా జీవించారని.. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని సీఎం జగన్ మేనత్త, వైఎస్సార్, వివేకానంద రెడ్డి సోదరి విమలారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన విమలారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని.. ఆమెను చూసి ప్రార్థన చేయడానికి వచ్చానని తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారన్నారు. దీనిని తాను తట్టుకోలేకపోతున్నానన్నారు. అవినాష్ కు ధైర్యం చెప్పి వచ్చానన్నారు. కష్టాలు ఎదుర్కొనే ధైర్యం చెప్పానన్నారు. శ్రీలక్ష్మి ఉపవాసాలు ఎక్కువ చేస్తోందని.. దీంతో లోబీపీ వచ్చిందని విమలారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం లిక్విడ్ ఫుడ్ సెలైన్ రూపంమలో ఇస్తున్నారని తెలిపారు. అవినాష్ ను టార్గెట్ చేస్తున్నారని.. లేట్ అయినా న్యాయం జరుగుతుందన్నారు. సునీత, అవినాష్ ఇద్దరూ తన వాళ్లేనని విమలారెడ్డి పేర్కొన్నారు. మొదట సునీత తన కుటుంబంలోని వాళ్ళెవరూ హత్య చేయలేదని చెప్పిందని ఆ తరువాత దుష్ట శక్తుల ప్రమేయంతో మాట మార్చిందన్నారు. ఇది తప్పని చెప్పినందుకు సునీత తనతో మాట్లాడటం మానేసిందని విమలారెడ్డి తెలిపారు.
Updated Date - 2023-05-24T12:21:15+05:30 IST